ప్రతినిధి (నవంబర్ 30):
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పండగ కార్యక్రమంలో పాల్గొని ఉమ్మడి జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.143.53 కోట్ల నిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
మహబూబ్ నగర్ పట్టణంలో ఉర్దూ ఘర్, శాదిఖాన, స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 45 కోట్ల నిధులతో శంఖుస్థాపన చేశారు.ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో 25 బి.టి రోడ్లకు రూ. 49.90 కోట్లు,
తాండాల నుండి గ్రామాలకు వెళ్లే మట్టి రోడ్లను బి.టి రొడ్డుగా మార్చేందుకు రూ. 10.68 కోట్ల నిధులతో చేపట్టే పనులకు శంఖుస్థాపన చేశారు.మిడ్జిల్ నుండి కొత్తపల్లి కి వెళ్ళే బి.టి రోడ్డు ను రెండు వరసల రోడ్డు గా మార్చేందుకు రూ. 25 కోట్ల నిధులతో చేపట్టే పనులకు శంఖుస్థాపన చేశారు.మహబూబ్ నగర్ పోతులమడుగు వద్ద రూ. 2.65 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన మినీ స్టేడియంకు ప్రారంభోత్సవం చేశారు.జోగులాంబ గద్వాల జిల్లాలో మానోపాడ్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అప్గ్రేడ్ కొరకు రూ. 3.25 కోట్లు, నందిన్నె కే.జి.బి.వి కి రూ. 2.70 కోట్లు, గట్టు కే జి.బి.వి కి రూ. 2.05 కోట్ల నిధుల పనులకు శంఖుస్థాపన చేశారు.అదేవిధంగా గద్వాల సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టోర్, ప్రభుత్వ వైద్య కళాశాలను వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశారు.