15 రోజుల క్రితం మొబైల్ మిస్
(సి ఈ ఐ ఆర్) పోర్టల్ ద్వారా మొబైల్ రికవరీ
జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శమహేందర్ మాట్లాడుతూ
అక్బర్ అలీ అనే వ్యక్తి మెదక్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో 15 రోజుల క్రితం ఫోన్ పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఫోన్ నెంబర్ ను మరియు ఐ ఎం ఈ ఐ నంబర్ ను సి ఈ ఐ ఆర్ పోర్టల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది. శనివారం ఫోను దొరికిన అతని వద్ద నుండి రికవరీ చేసి సంబంధిత బాధితునికి అప్పగించడం జరిగింది.
ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సి ఈ ఐ ఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని,తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు. ఈ ఫోన్ కనుగొనుటకు కష్టపడిన హెడ్ కానిస్టేబుల్ ఎండి లాయక్ అలీని కానిస్టేబుల్ మహేందర్ గౌడ్ ని ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మధు సూదన్ గౌడ్ పాల్గొన్నారు.