15 వేల అప్పు తీర్చడం కోసం మూడేళ్లు గుడ్డు చాకిరి చేస్తున్న బడుగు జీవులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
రూ.15 వేల అప్పు తీర్చడం కోసం ఈ బడుగు జీవులు మూడేళ్లు వెట్టిచాకిరీ చేశారు. కళ్లముందే కన్నబిడ్డలు చనిపోతే, పనిచేసే చోటికి కాస్తంత దూరాన, మట్టిలో పాతేయమన్నాడు యజమాని. తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా గుంపనపల్లిలో దాసరి వీరయ్య, జ్యోతికి జరిగిన విషాదం. మొన్న నవంబరుతో వీరి వెట్టికి కాలం తీరి, ఈ విషయం వెలుగుచూసింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు అనుభవించిన ఈ జంట ఇప్పుడు ప్రతిరోజు రోజువారి కూలికి వెళుతున్నారు. తమ పెద్ద బిడ్డ నాలుగేళ్ల చిన్నారిని భుజాన వేసుకుని పనికెళ్తున్న వీళ్లుతాము పడ్డ కష్టాలను ఆవేదనతో వివరిస్తున్నారు.
చెంచు తెగకు చెందిన వీరయ్య, జ్యోతి, చంద్య నాయక్, ముదావత్ పొలంలో మూడేళ్ల క్రితం పనికి వచ్చారు. పొలం యజమాని దగ్గర తీసుకున్న రూ.15 వేలు అప్పు తీర్చడం కోసం ఈ పనికి కుదిరారు. రెండు నెలలు, రెండేళ్లు, నాలుగేళ్ల వయసున్న బిడ్డలతో పనికి వచ్చిన ఈ కుటుంబం పట్ల యజమాని ఎప్పుడూ దయ చూపలేదని . తను పడ్డ కష్టాల గురించి వీరయ్య ఇలా చెబుతున్నాడు. ‘చిన్న బిడ్డలిద్దరికీ జ్వరం వచ్చింది, కామెర్లు సోకాయి. ఆస్పత్రికి వెళ్దామంటే మా చేతిలో చిల్లిగవ్వ లేదు. యజమానిని ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వలేదు. ‘రేపు, మాపు’ అంటూ కాలయాపన చేశాడు. చూస్తుండగానే బిడ్డలిద్దరూ మా కళ్లెదుటే చనిపోయారు. మేం పని చేస్తున్న పొలానికి కాస్తంత దూరంలోనే ఇద్దరినీ మట్టిలో కలిపేశాం’ అని వీరయ్య ఏడుస్తూ చెబుతుంటే జ్యోతి అచేతనంగా శూన్యంలోకి చూస్తూ ఉంది.
చెప్పులతో కొట్టేవారని
రేషన్ బియ్యం కొనుక్కునేందుకు యజమాని అనుమతి మాత్రం ఇచ్చేవాడని. కానీ కూరగాయలకు డబ్బులు ఇవ్వకుండా వేధించేవాడని . పాడైపోయిన, ఎండిపోయిన కూరగాయలు తీసుకొచ్చి వాటితోనే వంట చేసుకోమనేవారమని,. ఈ మూడేళ్లపాటు ఒక్క జత బట్టలతోనే కాలం గడిపాను. ఎప్పుడైనా డబ్బులు కావాలని అడిగితే చెప్పులతో కొట్టేవారని. ముఖం మీద, వీపు మీద, ఎక్కడ పడితే అక్కడ అదేపనిగా బాదేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానాలన్నీ భరిస్తూ రూ.15 వేలు అప్పు తీర్చేందుకే పడ్డాం’ అని వీరయ్య తను పడ్డ వేదనను వివరించాడు.
జ్యోతి, వీరయ్య ఈ పనికి రాకముందే, జ్యోతి తల్లిదండ్రులు ఈ పొలంలో వెట్టి చాకిరి చేస్తున్నారని . జ్యోతి తండ్రి చనిపోయేంతవరకు అక్కడే పనిచేశాడని. తల్లి ఇంకా అక్కడే పనిచేస్తోందని . పొలంలో మనుషులు తక్కువైన ముదావత్, వీరయ్య పనిచేస్తున్న పొలం యజమానితో ఒప్పందం చేసుకున్నాడని . అతని దగ్గర వీరయ్య చేసిన అప్పు తీర్చేసి, అక్కడ నుండి తన పొలానికి వీళ్లని తీసుకొచ్చాడని. ఈ మొత్తం వ్యవహారం వీరయ్య, జ్యోతికి చివరివరకు తెలియదని వివరించాడు.
ముదావత్ పొలానికి వచ్చాక వీరయ్య పిచికారీ చేసే పని, జ్యోతి పత్తి తీయడం, కలుపు తీయడం చేశారు. కరెంటు సౌకర్యం లేని, ఒక్క మనిషికి సరిపోయే గదిలో ముగ్గురు పిల్లలతో ఈ జంట మూడేళ్లు గడిపిందని .విశ్రాంతి లేకుండా పనిచేశాం అని ఆవేదనతో వివరించారు.ఎక్కువ పనిగంటలు చేసినా యజమానికి అసలు కనికరం ఉండేది కాదు. ఒళ్లు నొప్పులు, తీవ్ర అలసటతో నిద్ర లేవడం ఆలస్యమైనా తన్ని లేపేవారు. ‘ఇప్పటిదాకా పడుకుంటారా’ అని నోటికొచ్చినట్లు తిట్టేవారు . కొట్టేవారని , చేతిలో ఏది ఉంటే దాంతో బాదేవారని,చాలా దయనీయ పరిస్థితులు అనుభవించాం. పండక్కి ఊరు వెళ్లాలన్నా తక్కువ రోజుల సమయమే ఇచ్చేవారని, ఆ బాధను గుర్తు చేసుకున్నాడు వీరయ్య.
వెట్టి నుండి బయటికి వచ్చిన ఈ జంటని స్థానిక స్వచ్ఛంద సంస్థ కలిసింది. దాని చొరవతో ఈ విషయం మరో సంస్థ ఫౌండేషన్ ఫర్ సస్టైన్‌బుల్ డెవలప్‌మెంట్ (ఎఫ్ఎస్‌డి) దృష్టికి చేరింది. ‘ఇంత తక్కువ మొత్తానికి ఇంత కాలం పనిచేయడం, ఇన్ని కష్టాలు పడడం తెలిసి చాలా ఆశ్చర్యపోయాం. వ్యవసాయ కూలీలకు ఇచ్చే వేతనం ఇచ్చినా ఈ అప్పు 15 రోజుల్లో తీరిపోతుంది’ అని ఎఫ్ఎస్‌డి సభ్యులు మహేష్ చెబుతున్నారు. వీళ్ల చొరవతో ఈ విషయం జిల్లా మెజిస్ట్రేట్ వద్దకు వెళ్లింది. వీరయ్య దంపతులకు పరిహారం అందేలా చూస్తామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.