---Advertisement---
---Advertisement---

డిసెంబర్ 1న పోలీసు కిష్టయ్య స్మారకోపన్యాసం

తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో తొలి అమరునిగా చరిత్రకెక్కిన పుట్టకొక్కుల కిష్టయ్య అలియాస్ పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో స్మారక ఉపన్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ తొలి చైర్మెన్, ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పోలీస్ కిష్టయ్య స్మారక ఉపాన్యాసం చేస్తారని, తెలంగాణ మీడియా అకాడెమీ తొలి అధ్యక్షులు అల్లం నారాయణ ముఖ్యఅతిథిగా, రిటైర్డ్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆకుల నరసింహ ప్రత్యేక అతిథిగా హాజరవుతారని తెలిపారు. 2009 నవంబర్ 29 రోజున కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుండి సిద్ధిపేటలో ఆమరణ దీక్షకోసం బయలుదేరిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అల్గునూరువద్ద పోలీసులు అరెస్టు చేసి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించిన సంఘటనతో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైన పోలీసు కిష్టయ్య, అదే రోజుల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒంటిపై పెట్రోలుపోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడిన శ్రీకాంతాచారి సంఘటనతో మరింతగా కృంగిపోయి, రెండురోజులపాటు తీవ్రమనోవేధనకు గురై… డిసెంబర్ 1వ తేదీనాడు కామారెడ్డి పట్టణంలోని అనంతసాయి ఫంక్షన్ హాలు వద్దగల అర్ధరాత్రి సెల్ టవర్ ఎక్కి వందలాదిగా గుమూడిన ప్రజలు, కుటుంబసభ్యులు, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే దాదాపు రెండు గంటలపాటు ఆయనను సురక్షితంగా కిందికి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై, పోలీసు కిష్టయ్య తెల్లవారుజామున సుమారు 1.45 గంటలకు తమ సర్వీసు రివాల్వర్ తో కణతపై కాల్చుకుని అక్కడికక్కడే మృతిచెందారు.

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న శ్రీకాంతాచారి ఆ తరువాత

ఆసుపత్రిలో చికిత్సపొందుతూ డిసెంబర్ 3వ తేదీనాడు చనిపోయారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రసాధన

ఉద్యమపోరాటంలో డిసెంబర్ 1నాడు బలవన్మరణంచెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ అలియాస్ పోలీసు

కిష్టయ్య మలిదశ ఉద్యమంలో తొలి అమరునిగా కీర్తిశేషులయ్యారు. అందువల్ల పోలీసు కిష్టయ్యను తెలంగాణ

రాష్ట్రసాధన ఉద్యమంలో తొలి అమరునిగా గుర్తించాలని, ఆయన పేరిట పోలీసు శాఖలో ఒక అవార్డును నెలకొల్పాలని,

పోలీసు కిష్టయ్య వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రతియేటా డిసెంబర్ 1వ తేదీనాడు నిర్వహిస్తూ, ఆ రోజును

తెలంగాణ అమరవీరుల స్మారక దినంగా పాటించాలని పోలీసు కిష్టయ్య ముదిరాజ్ స్మారక ట్రస్టు ప్రభుత్వాన్ని

డిమాండు చేసింది. అంతేకాకుండా పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని బ్లాంకుబండుపై ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు

ఆయన త్యాగచరిత్రను పాఠ్యాంశంగా పుస్తకాలలో చేర్చాలని, ఉద్యోగవిధుల్లో ఉత్తమ సేవలందించే పోలీసులకు ఆయన

పేరిట ఒక స్మారక అవార్డును నెలకొల్పి ఆయన వర్ధంతి రోజున ప్రతియేటా అందించాలని స్మారకట్రస్టు ఈ ప్రకటనలో

డిమాండు చేసింది. డిసెంబర్ 1వ తేదీన సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఉదయం 10 గంటలనుండి నిర్వహించే పోలీసు

కిష్టయ్య స్మారకోపన్యాసం కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని పోలీసు కిష్టయ్య ముదిరాజ్ స్మారక ట్రస్టు

ఈ ప్రకటనలో కోరింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment