దుబ్బాక లో సావిత్రిభాయి ఫూలే 193 వ జయంతి వేడుకలు

దుబ్బాక లో సావిత్రిభాయి ఫూలే 193 వ జయంతి వేడుకలు

తెలంగాణ కెరటం దుబ్బాక ప్రతినిధి జనవరి

సిద్ధిపేట జిల్లా దుబ్బాక లో సిపిఎం ఆద్వర్యంలో సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్బంగా చిత్ర పటానికి పూలమాళ వేశారు.అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మట్లాడుతూ, దేశంలో హిందువులలో మెజారిటీ వర్గాలైన శూద్రులకు (బీసీ /ఎస్ సి ), మహిళలకు చదువును నిరాకరించిన సనాతన మనుస్మృతి దుర్మార్గపు కట్టుబాట్లను ప్రతిఘటించి అందరి చదువుకు ఆద్యురాలుగా నిలిచిన మొదటి ఉద్యమకారిని అన్నారు.మనుధర్మం కారణంగా చదువుకు దూరమైన క్రింది కులాలవారు, మరియు బాలికల కోసం దేశంలోనే మొట్ట మొదటి పాఠశాలను..1848లో మహాత్మ జ్యోతిరావు ఫూలే గారు పూణేలో స్థాపించాడని అందులో ఉపాధ్యాయురాలిగా సావిత్రిభాయి పనిచేయడం,కులదురహంకారులకు నచ్చలేదని విమర్శించారు.ఆమె పై వేధింపులకు పూనుకున్నారని పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం,రాళ్లు విసరడం, అసభ్యకర పదజాలంతో దూషించడం వంటివి చేసేవారని మండిపడ్డారు. పాఠశాలకు వెళ్లిన తర్వాత మలినమైన ఆ చీరను మార్చుకుని పాఠాలు బోధించిందని, శూద్రులు అస్పృశ్యులు చదివితే నాలుకలు కోయాలి పాఠాలు వింటే చెవుల్లో సీసం పోయాలి అనే మానసిక మనువాద సిద్ధాంతాన్ని మట్టిలో పాతిపెట్టిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి గారు అన్నారు.శూద్రులు విద్య నేర్చుకోవడం సహజమైన హక్కని అందరూ చదవాలి,అందరూ అసమానతలు లేకుండా బతకాలని పరితపించిన స్ఫూర్తిప్రదాత, అన్నారు.ఆమె గొప్ప ఉద్యమకారురాలు మంచి రచయిత్రి కులంపై కలంతో యుద్ధం నడిపిన కవయిత్రి.గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర బిజెపి ప్రభుత్వం మనుస్మృతి ఆధారంగా దేశంలో అనగారిన వర్గాలపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు.నూతన విద్యా విధాన చట్టం తీసుకొచ్చి పేదలకు మహిళలకు విద్యను దూరం చేస్తూ ధనవంతులైన వారికే విద్యను అందించే విధంగా చట్టంలో మార్పులు తెస్తుందని విమర్శించారు.సావిత్రిబాయి పూలే  ఆశయాలతో ప్రజలందరూ మనవాద, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుబ్బాక మండల కార్యదర్శి సింగిరెడ్డి నవీన, దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, నాయకులు సాజిద్,బత్తుల రాజు, లక్ష్మీనరసయ్య, మహేష్ తదితరులు

Join WhatsApp

Join Now

Leave a Comment