ఘనంగా బేడ బుడగ జంగం 23వ ఆవిర్భావ దినోత్సవం.
అమరులకు నివాళులు అర్పించిన నేతలు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్
బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బేడ బుడగ జంగం హక్కులపోరాట సమితిరాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం మల్లికార్జున్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్త పల్లి మండలకేంద్రంలో సోమవారం నూతనంగా జెండా ఆవిష్కరించారు. ఈ ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిడుగొండ కృష్ణయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం మల్లికార్జున్ జెండా ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ హక్కుల పోరాట సమితి అలుపెరగకుండా 22 వసంతాలు పూర్తి చేసుకొని 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదిగినటువంటి హక్కుల పోరాట సమితి గురించి ఎన్నో ఉద్యమాలు చేసి అమరులైన నాయకులను స్మరించుకుంటూ యువ నాయకత్వంతో ముందుకు వెళుతున్న సంఘం హక్కుల పోరాట సమితి అని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షులు గడ్డం సుభాష్, యూత్ అధ్యక్షులు గడ్డం సహదేవుడు, కోశాధికారి గడ్డం కుమార్, గడ్డం యాదగిరి గడ్డం వెంకటేష్, ధూపం రాములు, మరియు మహిళలు, కొల్లాపూర్ తాలూకా బుడగ జంగాలు మండల తాలూకా జిల్లా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు.