రైతు పండుగ సభకు తరలి వెళ్తున్న
తెలంగాణ కెరటం నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 30
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుండి మహబూబ్ నగర్ “రైతు పండుగ బహిరంగ సభకు తరలి వెళ్తున్న వాహనాలాన్ని పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి
జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు,రైతు కూలీల పక్షపాతి ప్రభుత్వం అని, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా మానశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి కృషి చేస్తున్నారని వారు అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఒక్క ఏడాదిలోనే అన్నదాతల సంక్షేమానికి రూ.54,280 కోట్లు ఖర్చు చేసిన ఘనత మనప్రజా ప్రభుత్వనికి దక్కుతుందని వారు అన్నారు..
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ, సన్న ధాన్యానికి క్వింటల్ కు 500 రూపాయలు బోనస్ అందజేయడంతో రైతుల మోఖంలో వెలుగులు నిండాయని వారు అన్నారు.
అదే విధంగా సంక్రాంతి నుండి రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 7500 పెట్టుబడి సహాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని త్వరలోనే నెరవేరబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి ,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళాడం జరిగింది.