*మధ్యాహ్న భోజనంను తనిఖీ చేసిన కాంగ్రెస్ నాయకులు*
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి నవంబర్ 30 :
మండలం లోని వడ్లూరు బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంను తనిఖీ చేయండం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, నాయకులు పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గుండా అమరేందర్ రెడ్డి, జనగం శంకర్, శీలం నర్సయ్య, బుర్ర తిరుపతి గౌడ్, బైర సంతోష్, జెల్ల ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.