*పురపాలక కమిషనర్ ను సన్మానించిన 29 వ వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణీ కృష్ణ*
తెలంగాణ కెరటం:మెదక్ జిల్లా బ్యూరో:నవంబర్ 30:
మెదక్ పట్టణములోని 29 వ వార్డు అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించాలని 29 వ వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణీ కృష్ణ కమిషనర్ కు తెలిపారు.అలాగే శనివారం రోజున మెదక్ పురపాలక శాఖ కార్యాలయంలో కౌన్సిలర్ దంపతులు బొద్దుల రుక్మిణి కృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.అనంతరం వార్డు అభివృద్ధిపై కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కూరగాయల మార్కెట్ లో వ్యాపారస్తుల దగ్గర కొందరు వ్యక్తులు మాములు వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్ లో మిగిలిన కూరగాయలను చెత్త బండ్లపై తీసుకపోవాలని చెప్పారు. కూరగాయలు కుల్లి పోయి మురికి కాలువల వేస్తున్నారని మున్సిపల్ సిబ్బంది ద్వారా చెత్తను తొలగిoచాలని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో రైతు బజార్ నిర్మాణం కోసం 70 లక్షలు మంజూరు ఇవ్వగా ఇప్పటి వరకు అసంపూర్తిగా మార్కెట్ యార్డ్ ఆగిపోయిందని అన్నారు. చిరు వ్యాపారులకు మార్కెట్ లో సరియైన స్థలం లేక ఇబ్బందులకు గురవు తున్నారని చెప్పారు. కమిషనర్ ప్రతి రోజు వార్డులలో పర్యవేక్షణ చెయ్యడం మంచి పరిణామంని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొద్దుల కృష్ణ అన్నారు. ఇప్పటి నుంచి ప్రతి సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాతున్నాని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బొద్దుల కృష్ణ తోపాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.