నవగ్రహాల ప్రతిష్టకు 30 వేల విరాళాలు
*శివయ్య కృపతో నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఉండాలి*
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
తెలంగాణ కెరటం
నవంబర్ 29
జిన్నారం మండలం
పటాన్ చెరువు ప్రతినిధి
శివయ్య కృపతో నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కోరారు. శుక్రవారం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు శివాలయంలో ఆలయ నిర్వాహకులు స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు సీజీఆర్ ట్రస్ట్ అధినేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శివయ్య కృపతో నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా 30 వేల రూపాయల విరాళాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ నిర్వహకులు ఘనంగా సన్మానించారు.