---Advertisement---
---Advertisement---

*రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ విరాళం*

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 10 :

 

మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ సైబరాబాద్ వారి ఆధ్వర్యంలో, డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాసం అనిల్ విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు రోటరీ క్లబ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విరాళం విద్యార్థుల సాంకేతిక విద్యలో, అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఓ.నాగయ్య, తోటపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యాయుల బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment