పాలకులు మారిన పరిష్కారం దొరికేనా

-ఆటపాటలతో నిరసన వ్యక్తం చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం 12వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం వందరోజుల గ్యారెంటీ ఏమైందని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు. ప్రజా పాలనలో ఆడపడుచులు రోడ్లమీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న న్యాయం జరిగేది ఎప్పుడు అని, ఇది నా ప్రజాపాలనని అని డిమాండ్ చేశారు.లక్షల మంది విద్యా భోజనం దూరమై, విద్యా వ్యవస్థ ఆగిపోయిన ప్రభుత్వం పట్టించకపోవడం పోషణీయమన్నారు, ఇప్పటికే బోధన, బోధన్ ఇతర పనులు ఆగిపోయినయని, ఎంఈఓ కార్యాలయాలకు తాళాలు పడ్డాయని, భవిత సెంటర్లు బంద్ అయ్యాయని అయినా ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కేజీబీవీ నాన్ టీచింగ్ వాళ్లను సమ్మె దీక్షలో జరగబోయే పరిణామానికి ప్రభుత్వం ది బాధ్యతని గుర్తు చేశారు. టి పి టి ఎఫ్ ఉపాధ్యాయ సంఘం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల కరపత్రాలను విడుదల చేశారు.కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు కుశల్, టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు లింగం, సమగ్ర శిక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి,శైలజ, దామోదర్, వీణ,సాయిలు లావణ్య, శ్రీను, మాధవి, గంగ ప్రసాద్, బన్సీలాల్, దినేష్, రాజు, రాధికా,లింగం, కృష్ణ, సంధ్య మరియుఇతరులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment