గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55 లక్షల పరిహారం అందజేత

గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55 లక్షల పరిహారం అందజేత

 యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన రాజా కుటుంబ సభ్యులు

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి జనవరి

గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజా 2022 డిసెంబర్ 27 న షార్జ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండస్ట్రియల్ ఏరియాలోని అనధికార స్థలంలో రోడ్డు దాటుతుండగా పాకిస్తాన్ కు చెందిన వాహనదారుడు ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే గద్దల రాజా ను షార్జా ఆల్ ఖాసిమియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందడం జరిగింది. మరణించిన గద్దల రాజా పై రహదారి దాటినందుకు అభియోగం మోపడం ద్వారా కేసును ముగించారు. ఆ సమయంలోనే గద్దల రాజా అతని బంధువైన రాజారాం, గద్దల రాజన్న వారసులు యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి కేసును అప్పగించడం జరిగింది. రోడ్డు దాటుతున్న పాదదారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కోర్టులో కేసు నమోదు చేశారు. దీంతో షార్జ కోర్టు లో తిరిగి కేసు నమోదు చేయడం వల్ల యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు చేసిన కృషి ఫలింతంగా రాజు కుటుంబానికి నష్టపరిహారం అందజేశారు. ఈ సందర్భంగా యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిసిపిరిని సోమవారం నిజామాబాద్ జిల్లా లోని జ్యాగిర్యాల్ విచ్చేసి మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి గత 15 సంవత్సరాలుగా మాయబ్ లీగల్ సర్వీసెస్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూదన్నారు. న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నామని, సగటు భారతీయుడికి సౌదీ, అరబ్, ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వారు యబ్ లీగల్ సర్వీసెస్ కు ఆశ్రయించిన మరో క్షణం నుంచి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామన్నారు. సోమవారం రోజు నిజామాబాద్ రావడం రాజు కుటుంబానికి డబ్బులు అందజేయడం మాకు ఎంతో ఆనందంగా కలిగించిందన్నారు యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో తో పాటు అరబ్ కంట్రీ సంస్థ సభ్యుడు షేక్ ఆల్ అజీజ్, అబ్దుల్ రావుఫ్. మునీత్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment