---Advertisement---

6,గ్యారంటీలు, 420 హామీలుఇచ్చి ఎక్కడ ఎవరికి అమలు చేశారు..

---Advertisement---

6,గ్యారంటీలు, 420 హామీలుఇచ్చి ఎక్కడ ఎవరికి అమలు చేశారు..

 

హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయకుండా సంబరాలుజరుపుకోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 15 :

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలపథకాలు,420 హామీలు ఇచ్చి,ఎన్నికల్లో గెలిచి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాది గడిచినప్పటికీ, 6 గ్యారంటీల పథకాలు,420 హామీలు,పూర్తిస్థాయిలో అమలు కాకుండానే, పథకాలు అమలు చేసి,నామ మాత్రంగా, కొందరికి అందించి,కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ పాలన సంబరాలు చేసుకోవడం పట్ల ప్రజలలో అసంతృప్తి వెలువెత్తుతుందని, ఏరుగట్ల మండల బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. శనివారం రోజు నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం పట్ల,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనుఏడాది లోపే అమలు చేసి అందించిన కాంగ్రెస్ దేనని , కాంగ్రెస్ నాయకులుమాట్లాడడంవిడ్డూరంగా ఉందని వారన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవని వారు ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసినప్పటికీ, ఏర్గట్ల మండలం కు, మెట్ పల్లి నుండి ఎన్నో బస్సులు రాకపోకలుకొనసాగేవని, ఉచిత బస్సు పథకం అమలు కాగానే మెట్ పల్లి నుండి ఏర్గట్ల మండలానికి ఒకే బస్సు పరిమితమైందని,ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతూ, ఆగ్రం వ్యక్తం చేస్తున్నారని వారుపేర్కొన్నారు. బస్సులు ఎన్ని నడిచేవి, ప్రస్తుతము ఎన్ని నడుస్తున్నవి, ఎంతమంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది, ఉచిత బస్సు పథకం పేరుతో 3 బస్సులనుతగ్గించడంతో,ప్రయాణం చేయవలసిన మహిళలు సురక్షితంగా వెళ్లలేకపోతున్నారని, ఇవి ఏమీ తెలియకుండా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోవడం పట్ల మహిళలు తమ ఉసురు కాంగ్రెస్కు తగులుతుందని పేర్కొంటున్నారని వారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన లక్ష రూపాయలతో తులం బంగారం ఇస్తామనిచెప్పి ఎక్కడ ఇచ్చారని వారు ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లనిర్మాణాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షలు అందిస్తే,కాంగ్రెస్ ప్రభుత్వం 5,00,000 అందిస్తామని చెప్పి, కాంగ్రెస్ యాడాది పాలనలో ఎంతమందికి,ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు, యాడాది పాలనలో ఎంత మందికి అందించారని, రైతులకు పూర్తిస్థాయిలో రెండు లక్షలరుణమాఫీ ఏకాకాలంలో చేయకుండా,రైతు భరోసా అందించకుండా, దొడ్డు, సన్నంక్వింటాలు వరి ధాన్యానికి 500 రూపాయల అందిస్తామని చెప్పి, ఎంతమంది రైతులకు బోనస్ అందించారని, ప్రతికుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్న,ఉద్యోగస్తులైన 2500 రూపాయలు పెన్షన్, అందిస్తామని చెప్పి, ఇప్పటివరకు ఎక్కడ ఎవరికి అందించారని వారు ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో30 వేల పైగా ఉద్యోగాలు కల్పిస్తే, మేమే ఉద్యోగాలు అందించామని చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు, నాయకుల అమలు కానీ పథకాలను సైతం అమలు చేశారని చెప్పుకోవడంవారి అవివేకానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి ఇప్పటివరకు 100% అమలు చేసిన దాఖలు లేవని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బి ఆర్ ఎస్ ప్రభుత్వం పై, నాయకులపై గాని తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, చిత్తశుద్ధి ఉంటేఇచ్చిన హామీలను, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా,కాంగ్రెస్ నేతలు గాని,కాంగ్రెస్ నాయకులు గానీ, దృష్టి సారించి గ్రామాల, ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై విమర్శిస్తే,ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరుగ్యారంటీలను,420 హామీలను,అమలు చేయకుండా సంబరాలు చేసుకోవడం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై, నాయకుల తీరుపై, అన్ని వర్గాల ప్రజలుఆలోచిస్తున్నారని,ఇచ్చిన హామీలను, గ్యారంటీ పథకాలను అమలు చేయకుంటేరాబోయే కాలంలో ప్రజలే తాగిన గుణపాఠం చెప్తారని, ఏర్గట్ల మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షా, కార్యవర్గ సభ్యులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment