ఖమ్మం, జనవరి 03 (తెలంగాణ కెరటం): వీరనారిమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర కిషన్ నాయక్, ధరావత్తు రమేష్ నాయక్ మాట్లాడుతూ.. మహిళల కోసం సావిత్రిబాయి పూలే అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తొలి పంపతులమ్మగా ఆమె మహిళా లోకానికి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఇప్పటికీ మహిళలపై ఉన్న అసమానతలను తొలగించేందుకు.. వీర నారీమణుల ఆశయ సాధన సమితీ లాంటి స్వచ్చంద సంఘాలు చేస్తున్న పోరాటం హర్షించదగినదని అన్నారు.
