అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.
దాడులు జరుగుతున్న ఆగని అక్రమ రేషన్ బియ్యం దందా..
చూసి చూడనట్లుగా వివరిస్తున్న అధికారులు..
తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి: జనవరి 08, అక్రమ రేషన్ బియ్యం రవాణా రాయపోల్ మండలంలోని రామారం. సమీపంలో జోరుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వహవ్యవరిస్తున్నారు. ఒకపక్క టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ. వ్యాపారులు మాత్రం రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసుకుని చిన్న వ్యాపారుల వద్ద తీసుకొని వాటిని మిల్లులకు తరలించకుండా కోళ్ల ఫారాలు. ఇళ్లల్లో నిల్వ ఉంచి సమయం వచ్చినప్పుడు రైస్ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా మండలంలోని రామారం గ్రామానికి చెందిన ఎనగందుల సతీష్ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులకు నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం దాడులు చేసి ఇంట్లో ఉన్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక మండల 60 భాను ప్రకాష్ కు సమాచారం అందించారు ఆయన గ్రామానికి వెళ్లి విచారణ జరుపగా 13 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఇంట్లో ఉండగా వాటిని స్వాధీనం చేసుకుని దౌల్తాబాద్ ఎంఎల్ఎస్ గోడౌన్ పాయింట్ కు తరలించినట్లు ఆర్ఐ భాను ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు.అధికారులకు కాగా ఇటీవల రామారం పరిసర ప్రాంతాల్లోకేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం యథేచ్ఛగా కొనసాగుతుండడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం వ్యాపార ఇష్టారాజ్యం ఫలితంగా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం రైస్ మిల్లర్లకు అందడంతో వ్యాపారులు కూడా వారిని ప్రోత్సహించి బియ్యాన్ని సేకరించి అక్రమంగా రవాణా చేస్తూ కోట్లకు పడగా లేపుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై జిల్లా ఉన్నతాధికారులు. మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం ద్వారానే ప్రతినిత్యం రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగులోకి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైస్ మిల్లు తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెల్లోకి వస్తాయని రైతులు ప్రజలు పేర్కొంటున్నారు.