నాకు ఏమీ తెలియదు అన ఏఈ
లైన్మెన్ కాంట్రాక్టర్ డి ఈ, చెబితేనే చేశాను అన కాంట్రాక్టర్,
ఒకటి కాదు మక్తల్ లో ఐదుకు పైగా లైన్లో మార్చేశారు,
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లో కరెంటు అధికారుల అవినీతులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, పంచలింగాల గ్రామంలో జరిగిన సంఘటన పూర్తికాకముందే మక్తల్ సబ్స్టేషన్ వెనుక నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ప్లాట్ లలో 11 కెవి 33 ని అనుమతి పత్రాలు లేకుండానే సాంక్షన్ లెటర్ రాకంటే ముందే కనీసం ఏఈకి సమాచారం కూడా ఇవ్వకుండా వారితో కొంత డబ్బు తీసుకొని లైన్మెన్ లక్ష్మణ్ డి ఈ కాంట్రాక్టర్ కృష్ణ కుమ్మక్కై రెండు రోజులలోనే లైన్ యదేచ్చగా మార్చేశారు,అని పలువురు తెలిపారు, ఇట్టి విషయంపై వార్తా ప్రచురించడం జరిగింది, స్థానిక ఏఈని వివరణ కోరగా దానితో వారు లెటర్ కొంత చాలా కట్టడం జరిగింది కానీ ఇంకా సాంక్షన్ లెటర్ రాలేదు అని ఏ ఈ చెప్పారు, స్థానిక లైన్మెన్ లక్ష్మణ్ గౌడ్ మక్తల్ లో ఉన్న పలువురు రాజకీయ నాయకులను కలిసి రిపోర్టర్ కు ఫోన్ చేయండి, వార్తలు బంద్ చేయంమని చెప్పండి లేదనుకుంటే కొంతమందితో అక్రమంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు, ఏది ఏమైనా ఈప్పటికి కైనా జిల్లా ఉన్నతాధికారులు మక్తల్ లో జరుగుతున్న కరెంటు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్థానిక 33, 11 కేవీ వివిధ లైన్లను ఎలాంటి సాక్షులు లేకుండా మార్చినవి పూర్తి వివరాలతో సహా ఉన్నతాధికారులకు సమర్పించి లైన్మెన్ సస్పెండ్ చేయాలని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టులో పెట్టాలని లంచం తీసుకున్న డి ఇ లపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు, త్వరలోనే ఉన్నతాధికారులు చర్య తీసుకోకపోతే కొంతమంది విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు, ఏది ఏమైనా అప్పటికి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మక్తల్ లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు,