---Advertisement---

కేజీబీవీ విద్యార్థినిలకు సైబర్ క్రైమ్ గురించి అవగాహన

---Advertisement---

ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఏఎస్ఐ రవీందర్,మండల పోలీస్ సిబ్బంది

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి నవంబర్ 28,

మండల పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో (జిసిఈసి) బాలిక సాధికారత ప్రోగ్రామ్ లో భాగంగా మర్కుక్ మండల ఏఎస్ఐ రవీందర్,మండల పోలీస్ సిబ్బంది వారు విద్యార్థులకు గుడ్ టచ్ బాడ్ టచ్,యాంటీ ర్యాగింగ్,సైబర్ క్రైమ్,బాల్య వివాహాలు గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏఎస్సై రవీందర్ మాట్లాడుతూ మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి,షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి,షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి,ర్యాగింగ్,ఇవిటీజింగ్,పోక్సో,షీ టీమ్స్,యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి,అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని,సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని,పోలీస్ సిబ్బంది మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు.మహిళల భద్రత మా ముఖ్య బాద్యతని చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దని అన్నారు.ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని,డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని,బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలియజేశారు.బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.బాల్యవివాహాల వల్ల అమ్మాయి,అబ్బాయి జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నరేష్,లేడీ కానిస్టేబుల్ జ్యోతి,డబ్ల్యూ.డి డిపార్ట్మెంట్ డేబోరా రాణి,పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి,తెలుగు టీచర్ శ్రీలత,అకౌంటెంట్ రోజా,విద్యార్థినులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment