తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 28:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు అభివృద్ధి ద్యేయంగా చేపట్టిన పథకాలపై అవగాహన కల్పించేందుకు, మరియు రైతుల సంక్షేమానికిప్రాధాన్యమిచ్చేందుకు రైతు పండగ పేరిట మూడు రోజుల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రజా పాలన విజయోత్సవాల లో భాగంగా,ఈ రైతు పండగ స్థానిక సమీకృత కలెక్టరేట్ ఆవరణలో, కలెక్టర్ రాహుల్ రాజ్ చేత లాంఛనంగా ప్రారంభించబడింది.ఈ సందర్భంగా,జిల్లా వ్యవసాయ అధికారి గత సంవత్సర కాలంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల వివరాలను గౌరవ కలెక్టర్ గారికి నివేదించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా రైతాంగం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను వ్యవసాయ అనుబంధ శాఖ ల సమన్వయంతో విజయ వంతంగా అమలు చేయడం జరిగింది అని తెలిపారు.
మెదక్ జిల్లా రైతు సంక్షేమ పథకాల విజయాల గురించి వివరించారు.జిల్లాలోని రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ, ఈ పథకాలు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని, వాటి అమలులో జిల్లా వ్యవసాయ శాఖ పాటించిన కృషిని ప్రశంసించారు.ఈ విజయాలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అంకిత భావంతో, వారి సంక్షేమానికి చేసిన కృషిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. రైతుల అభివృద్ధి అందరి బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.రుణ మాఫీ రైతుల వ్యవసాయ భవిష్యత్తుపై కొత్త ఆశలను కలిగించినట్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు
పంట రుణాల మాఫీ చేయడం చిన్న మరియు సన్నకారు రైతులకు చాలా పెద్ద సహాయం.రుణ మాఫీ వారి కుటుంబానికి చాలా ఉపశమనం
కలిగించిందని తెలుపుచున్నారు.
రైతులు రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడే వారు కానీ ఈ రుణ మాఫీ రైతాంగానికి చాలా ఒత్తిడి నుండి రక్షించిందని తెలుపుచున్నారు .
రైతులను ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతులు అభినందిస్తున్నారు.దానికి ఈ రుణమాఫీ ఒక గొప్ప ఉదాహరణ. అని అన్నారు
రైతు భరోసా పథకం
యాసంగి 2023-24: 263,933 రైతుల ఖాతాల్లో ₹194.54 కోట్లు జమ.రుణ మాఫీ పథకం
మొత్తం: 82,294 రైతులకు 604.21 కోట్లు మాఫీ.
1వ విడత (1 లక్ష వరకు): 48,251 రైతులకు ₹240.78 కోట్లు 2వ విడత (₹1 లక్ష నుండి 1.5 లక్ష వరకు): 21,618 రైతులకు ₹204.40 కోట్లు.
3వ విడత (₹2 లక్షల వరకు): 12,425 రైతులకు ₹159.03 కోట్లు.రైతు బీమా పథకం 2023 డిసెంబర్ – 2024 నవంబర్: 1,029 రైతు కుటుంబాలకు ₹54 కోట్లు చెల్లింపు.పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ (2024) మొత్తం పంపిణీ: 5,599 క్వింటాల్స్, 60% రాయితీపై.జీలుగ: 4,017 క్వింటాల్స్.జనుము: 1,582 క్వింటాల్స్ మొత్తం సబ్సిడీ నగదు: ₹3,10,08,966.• లబ్ధిదారులు: 11,027 రైతులు.పంట నష్ట పరిహారం మార్చి 2024: 957 రైతులకు, 714.17 ఎకరాలకు ₹71,44,250 (ఎకరాకు ₹10,000 చొప్పున).వరి సన్నధాన్యం కొనుగోలు.వానాకాలం 2024: 307 మంది రైతులకు 3,69,75,232 మద్దతు ధర + 79,68,800 బోనస్ చెల్లింపు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ మరియు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ సురేష్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ కరుణాకర్ పాల్గొన్నారు.