విద్యార్థులకు కొంత రిలాక్సేషన్ కలిగింది
వాకిట శ్రీదేవి పి ఆర్ టి యు స్టేట్ ప్రెసిడెంట్ టీఎస్ అసోసియేట్
తెలంగాణ కెరటం నవంబర్ 29 గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి
శుక్రవారం పిఆర్టిఎస్ అసోసియేట్ అధ్యక్షురాలు వాకిట శ్రీదేవి మాట్లాడుతూ పరాయి పాలనలో ఇండియా నలిగినట్లు సిసిఈ విధానంతో ఈ పది సంవత్సరాలు విద్యార్థులు నలిగిపోయారు ఇటు ఉపాధ్యాయులు నలిగిపోయారు. ఈ విధానం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా అంటే నేనైతే ఏమి ఉపయోగం లేదని చెప్తాను. పిల్లలకి ఈ విధానం వల్ల ఏమైనా నేర్చుకున్నారా అంటే ఉన్న రైటింగ్ కూడా మొత్తం దెబ్బతిన్నది. పిల్లలకు కొందరికి అయితే కనీసం రాయడానికి కూడా రావడం లేదు.
పిల్లలకు చదవడం రాయడం నేర్పుదామంటే సమయం దొరకడం లేదు.
ఎంతసేపు ప్రతి ఉపాధ్యాయుడు ఎక్స్పరిమెంట్లు అసైన్మెంట్లు ప్రాజెక్టులు స్లీప్ టెస్ట్ లు ఇదే గోల ఇదే గోల ఇదే గోల
ప్రతి సంవత్సరం ఒక ఉపాధ్యాయుడు ఒక్కొక్క ఫార్మేటివ్ కు నాలుగు అంశాలను పరీక్షించాలి.
ఒక్కొక్క ఫార్మేట్ ఒక విద్యార్థి ఏడు సబ్జెక్టులలో 28 అంశాలు ఉపాధ్యాయులకు సమర్పించాలి
ఒక సంవత్సరానికి నాలుగు ఫారమేటివ్ (4 ఎఫ్ ఏ ఎల్ యు)కలిపి 112 అంశాలు విద్యార్థులు ఉపాధ్యాయులకు ఏడు సబ్జెక్టులలో సమర్పించాలి
ఒక్కసారి ఊహించుకోండి విద్యార్థి పరంగా ఆలోచిస్తే ఇది విద్యార్థికి ఎంత భారమవుతుందో ఆలోచించండి
సీసీఈ విధానం వల్ల విద్యార్థులు ఏమైనా నేర్చుకున్నారు అంటే ఏమీ నేర్చుకోలేదని చెప్పవచ్చు మొక్కుబడిగా మార్కులు వేయాలని ఎంతసేపు మార్కులు వేయాలన్న ఆలోచనతోనే వాటిని కంప్లీట్ చేశాము
ఇప్పుడు ఈ విధానం తొలగించారు కాబట్టి విద్యార్థుల మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి చదవడం రాయడం అన్ని నేర్పడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్టు నేర్పించడానికి ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుంది.
విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది చేసినందుకు సీసీఇ విధానం తొలగించిన వ్యక్తులకి సీసీఈ విధానం తీసివేయడానికి కృషి చేసిన వ్యక్తులు అందరికీ మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుం టున్నాను