*ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
స్వయంగా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అందించిన అద్భుతమైన మార్గదర్శనియ గ్రంథం భగవద్గీత.. అలాంటి భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని.. ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తే మనిషి సన్మార్గంలో వెళ్లడానికి దోహదపడుతుందని *వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చిన హరే రామ హరే కృష్ణ బృందం గత రెండు మూడు రోజులుగా వికారాబాద్ పట్టణంలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా భగవద్గీత ప్రాముఖ్యతను తెలుపుతూ భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఇది తెలుసుకున్న చైర్ పర్సన్ దంపతులు ఉదయం హరే రామ హరే కృష్ణ బృందం దగ్గరికి వెళ్లి తమవంతుగా డొనేషన్ అందించారు. దాంతో వారు చైర్ పర్సన్ దంపతులకు భగవద్గీత పుస్తకాలు అందించారు. ఈ పుస్తకాలను వికారాబాద్ పట్టణ ప్రజలకు పంచుతామని చైర్ పర్సన్ వెల్లడించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ప్రతిరోజు భగవద్గీత పఠనం ద్వారా ఉత్తమ మానవీయ విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదపడే మనుషులు తయారు అవుతారు. నేటి ఆధునిక యుగంలో భగవద్గీత అత్యుత్తమమైన వ్యక్తిత్వ వికాసానికి ఉపయుక్తమైన గ్రంథం. కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత పఠనం చేయాలని చైర్ పర్సన్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.