---Advertisement---

ప్రాణదాత కటుకం గణేష్ ను సత్కరించిన జువ్వాడి బ్రదర్స్ 

---Advertisement---

ప్రాణదాత కటుకం గణేష్ ను సత్కరించిన జువ్వాడి బ్రదర్స్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 30 : ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కటుకం గణేష్ ను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సోదరులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జువ్వాడి బ్రదర్స్ మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతంలో ఒకప్పుడు రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుండి సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదువ లేకుండా చూస్తున్న కటుకం గణేష్ ధన్యజీవి అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టి ఇంకా మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కేర చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు గంగుల రాంగోపాల్, ప్రజాపక్షం ఆర్సి ఇంచార్జి మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment