- పదవులతో సంబంధం లేకుండా చేర్యాల బిడ్డగా డివిజన్ కోసం కృషి చేస్తా
* జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి
* జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప దీక్ష విజయవంతం
తెలంగాణ కెరటం చేర్యాల ప్రతినిధి నవంబర్ 30 :
పదవులతో సంబంధం లేకుండా ఈ ప్రాంత బిడ్డగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపబుయిష్టంగా అశాస్త్రీయంగా చేర్యాల ప్రాంతాన్ని చిందరవందర చేయడం వల్ల ఏర్పడిన నష్టాన్ని సరిచేస్తూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంత బిడ్డగా తన వంతు కృషిని తప్పకుండా చేస్తానని ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ని ఒప్పించి మెప్పించి చేర్యాల డివిజన్ తీసుకొచ్చి చేర్యాల ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష కళ ను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. చేర్యాల ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, అలాంటి చరిత్ర మరుగున పడిపోవడానికి ముఖ్య కారణం డీ లిమిటేషన్ లో నియోజకవర్గాన్ని విచ్చిన్నం కావడానికి ప్రధాన కారణం అప్పటి ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వీరిద్దరూ డి లిమిటేషన్ కమిటీలో రాష్ట్రం నుండి సభ్యులుగా ఉండి వారి స్వార్థ రాజకీయం కోసం ఈ నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసి ఈ ప్రాంత అభివృద్ధి కాకుండా అడ్డుకున్న చరిత్ర వారిదని అన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట ప్రాంతాలను సిద్దిపేటలో కలుపుకొని హరీష్ రావు ఇక్కడి సంపదను, నీళ్లను, నిధులను తన ప్రాంతానికి ఎత్తుకెళ్లారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేర్యాలను డివిజన్ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేశామన్నారు. ఎన్నికలకు ముందు జనగామ లో జరిగిన బహిరంగ సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేర్యాల డివిజన్ ప్రస్తావన తీసుకువచ్చారని కచ్చితంగా రానున్న రోజుల్లో సబ్బండ వర్గాల మద్దతుతో చేర్యాల డివిజన్ తోపాటు నియోజకవర్గ ఏర్పాటుకు కృషి చేస్తానని మాట ఇచ్చారు. 8 సంవత్సరాలు ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్సీ గా ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డి నాది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజల ఉద్యమం పట్ల రెవెన్యూ డివిజన్ అంశం పట్ల ఏనాడు పట్టించుకోని నేటి ఎమ్మెల్యే నేడు రెవెన్యూ డివిజన్ విషయంలో ము చిలక పలుకులు పలుకుతున్నారని నీ మాటలు చూస్తే ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచినట్లేనని పల్లా, ముత్తిరెడ్డి ఈ ప్రాంతం వారైతే ఎప్పుడో డివిజన్ తీసుకొచ్చేవారని ప్రాంతీయతరులు కాబట్టే ఈ ప్రాంత వింత విచ్చిన్నమైనా మౌనంగానే ఉండి చీరాల ప్రాంతానికి ద్రోహం చేశారని విమర్శించారు. ఈ ప్రజా సంకల్ప దీక్షకు అధ్యక్షత వహించిన డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ మాట్లాడుతూ.. సాధన అంశము రెవెన్యూ డివిజన్ సాధన అంశం కాకుండా రాజకీయ నినాదం కాకుండా ప్రజల నినాదమని ప్రభుత్వానికి తెలియజేయడానికే ప్రజాసంకల్ప దీక్ష ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఇదే పట్టుదల తోటి డివిజన్ వచ్చేంతవరకు జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గిరికొండల్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా-వెంకట చారి, పుర్మ ఆగం రెడ్డి, కామిడి జీవన్ రెడ్డి, అందె అశోక్, అందె బీరయ్య, దాసరి కళావతి, కొమ్ము నర్సింగరావు, చింతా భూమేశ్వర్, మెరుగు కృష్ణ, కొమ్ము రవి, కోల సాయిలు, మల్లిగారి యాదయ్య, బుట్టి సత్యనారాయణ,మెరుగు శ్రీనివాస్, మేక మల్లేశం, చెరుకు రమణారెడ్డి, చేటుకూరి కమలాకర్, ఎస్ వీ శ్రీకాంత్, బస్వగళ్ళ సిద్దయ్య, ఆడెపు చంద్రయ్య, సుందరగిరి భాస్కర్, పాకాల వెంకన్న, రామడుగు బాల్ రాజు, సీ.హేచ్ కృష్ణాజీ, ఆది శ్రీనివాస్, పందిళ్ల నరసయ్య, టివి నారాయణ, చందా శ్రీకాంత్, బుట్టి భిక్షపతి, ముంజే మల్లేశం, మంచాల చిరంజీవులు, గద్దల మహేందర్, ఈరి భూమయ్య, అందె నాని బాబు, ఎండీ. జహిరద్దీన్, అంబటి అంజయ్య, అవుశర్ల యాదయ్య, దాసరి శ్రీకాంత్, రామగళ్ల నరేష్, పాల లక్ష్మి నారాయణ, పాకాల ఇసాక్, వంగ జయ, తోళ్ల రాజేశ్వరి, సందిటి లక్ష్మి, రేకులపల్లి విజయ, చల్ల లత రెడ్డి, లలిత, ఎండి రేష్మ, పిల్లిచెవిటి లింగం, ఆడెపు నరేందర్, తుమ్మలపల్లి లీల సంజీవులు, ముస్త్యాల తార-యాదగిరి, పందిళ్ల నర్సయ్య, జంగిలి యాదగిరి, తాళ్లపల్లి రమేష్, పిల్లి చంద్రం, టీవీ నారాయణ, కరెడ్ల రఘుపతి రెడ్డి, కత్తుల భాస్కర్ రెడ్డి, వలబోజు నర్సింహా చారి, శ్రీరామల్లేశం,పోతుగంటి ప్రసాద్, సనవాల ప్రసాద్, ఆరుట్ల వినిత్, మిట్టపల్లి నర్సిరెడ్డి, బండి శ్రీనివాస్, బత్తిని నర్సింహులు, బైరగోని భాను, బండారి కనకయ్య, వంగ కృష్ణా రెడ్డి, కర్క తిరుపతి రెడ్డి, సింగపాక కుమార్, కాశెట్టి ఉపేందర్, ఆరే సాయిలు, సూర సంపత్, ఎండి .ముకీం, బడేమియా, మల్లిగారి నర్సింహులు, పచ్చిమడ్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.