---Advertisement---

అయిలాపూర్ లో ఘనంగా రైతు పండగ కార్యక్రమం 

---Advertisement---

అయిలాపూర్ లో ఘనంగా రైతు పండగ కార్యక్రమం

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 30 : కోరుట్ల మండలంలోని అయిలపుర్ గ్రామ రైతు వేదికలో శనివారం ప్రభుత్వం నిర్వహించిన రైతు పండగను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు మహబూబ్ నగర్ లో హాజరైన రైతు పండగను రైతు వేదిక, అయిలపూర్ లోని రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, అధికారులు ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. రైతు పండగ సందర్భంగా మండలంలోని 920 రైతులకు 07 కోట్ల 99లక్షల రూపాయలు పైన ఋణ మాఫీ చేయబోతున్నారని తెలిపారు.రైతు ఋణ మాఫీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించిన ఇతర ముఖ్య పథకాల గురించి, పథకాల ద్వారా రైతులకు అందించిన లబ్దిని గురించి వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరై రైతు వేదికలోని ప్రత్యక్ష ప్రసారంను వీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, ఐలపుర్ సొసైటీ సింగిల్ విండో ప్రెసిడెంట్ సాయి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల రైతులు, ఏఈఓలు ఫమీన, నరేష్, శ్రీహరి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment