మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 30 : కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం చైర్ పర్సన్ అన్నం లావణ్య అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో 16 అంశాలను పొందుపరచగా పలు అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కమిషనర్ బట్టు తిరుపతి, డి.ఇ.ఇ సురేష్, మేనేజర్ సి.హెచ్ శ్రీనివాస్, టి.పి.ఓ ఎ.ప్రవీణ్ కుమార్, జె.ఎ.ఓ వి.శివకుమార్, ఏ.ఇ అరుణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది పాల్గోన్నారు.