---Advertisement---

ఆయిలాపూర్ లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు 

---Advertisement---

ఆయిలాపూర్ లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు

 

ముఖ్య అతిథిగా హాజరైన కో ఆర్డినేటర్ బాస వేణుగోపాల్

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 01 : కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావుల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రజా పాలన విజయోత్సవాలను అయిలాపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కోరుట్ల అసెంబ్లీ ప్రజా పాలన విజయోత్సవాల కోఆర్డినేటర్ బాస వేణు గోపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి మహిళా మహాలక్ష్మి పథకం ద్వారా చాలా సంతోషంగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, గృహ లక్ష్మి పథకం ద్వారా జీరో కరెంట్ బిల్లుల ద్వారా లబ్ది పొందుతున్నారని, పేద ప్రజలకు డబ్బు ఆదా అవుతుందని, గత ప్రభుత్వం బిఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి గ్యాస్ ధరలను విపరీతంగా పెంచాయని, కానీ కాంగ్రెస్ ప్రజా పాలనలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందుకొని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. సన్న వడ్లకు రూపాయలు 500 బోనస్ ప్రకటించి వ్యవసాయాన్ని పండుగల చేశాయని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని,గల్ఫ్ దేశాలలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం కింద అందిస్తున్నారని, బిఆర్ఎస్ ఏనాడు పట్టించుకున్న సందర్భం లేదని అన్నారు.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసమర్థత పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రథసారథి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం అన్ని వర్గాల సంక్షేమం, మరియు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉంచడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఏలేటి శశిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్, ఐలాపూర్ ప్యాక్స్ చైర్మన్ చింతకుంట సాయి రెడ్డి, మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు, ఇబ్రహీంపట్నం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దూడ బాపురెడ్డి, పల్లపు రాజు, జక్కుల రాజం,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, మండల బిసి సెల్ అధ్యక్షులు ముక్కెర లింబాద్రి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హరీష్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మంథని గంగ నరసయ్య, కోరుట్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కరిపెల్లి అజయ్, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి సరికెల్లా నరేష్, కోరుట్ల మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముక్కెర రాజేష్, కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు సైదు గంగాధర్, ఎక్స్ జెడ్పిటిసి తోటగంగాధర్, మండలంలోని పలు గ్రామ శాఖ అధ్యక్షులు నక్క సుధీర్,మరి పెళ్లి జనార్ధన్,ఆర్మూర్ గంగాధర్, చిట్టిబాబు, శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి,నాగునూరి గంగాధర్,ఆవు నూరి కాశిరెడ్డి, కుర్మ తిరుపతి, గడ్డం హన్మక్క,ఎనుగందుల పద్మ,రసూల్,మహేష్,తొట్ల మహేష్, పల్లపు అశోక్,అదీబ్,పొట్ట ఉపేందర్, సందరగిరి శివ, బింగిసారం శివప్రసాద్, చిరాగ్, రాజశేఖర్, చంద్రమౌళి, గంగాధర్, బక్కన్న, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment