---Advertisement---

శివారు వెంకటాపూర్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా

---Advertisement---

-సొంత ఖర్చుతో బోరు వేయించి,మోటర్ ఇప్పించిన నాయకుడు

-నీటి కష్టాలు తీర్చిన కనకయ్యకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

-గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

-బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 08,

  • సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో బాధపడుతున్నందున,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య తన సొంత ఖర్చుతో బోర్ వేయించి మోటర్ ఇప్పించి గ్రామస్తులకు అండగా నిలిచారు.అనంతరం తుమ్మల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు కొన్ని రోజుల క్రితం నుండి నీటి సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నామని,తమ దృష్టికి తీసుకొచ్చారని,గత వారంలో కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం బోరు వేయించడం జరిగిందని అన్నారు.వేయించిన బోర్ లో ఆదివారం నాడు మోటర్ దించడం జరిగిందని అన్నారు.గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటామని,గ్రామా అభివృద్ధికి తమ వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు.అడిగిన వెంటనే కాలనీ వాసుల బాధ విని నీటి కష్టాలు తీర్చిన తుమ్మల కనకయ్యకు కాలనీ వాసులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పుట్ట కిష్టయ్య,ఇస్తారి,భాస్కర్,మల్లేశం,సత్యయ్య,ప్రవీణ్,అశోక్,యాదగిరి,బాలయ్య,రాజు,ఇస్తారి,కర్ణాకర్,కిష్టయ్య,వెంకటయ్య,చంద్రకళ,కనకవ్వ,లక్ష్మి,శ్యామల,కాలనీ వాసులు మహిళలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment