---Advertisement---

కొడంగల్ వాసికి 2 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్ లో ఆఫర్:*

---Advertisement---

_*కొడంగల్ వాసికి 2 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్ లో ఆఫర్:*

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (డిసెంబర్ 8)

 

_వికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం బొంరస్ పేట్ మండలం,తుంకిమెట్ల గ్రామానికి చెందిన సయ్యద్ యాసిన్ ఖురేషి (జైంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలంగాణ) గారి కుమారుడు సయ్యద్ అర్బాజ్ ఖురేషి (26) కి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్ లో రూ. 2 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో అమెరికాలో అప్లై సైన్స్ టెస్ట్  ఉద్యోగావకాశం వచ్చింది. నేడు (9-12-2024) అతను ఈ ఉద్యోగంలో చేరాడు.2019 లో ఐఐటి పాట్నా నుండి కంప్యూటర్ సైన్సులో తన బీటెక్ పూర్తి చేసిన ఈ యువకుడు 1980-90 ల్లో నియోజకవర్గంలో ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించిన గాంధేయవాది, మానవతావాది,అప్పటి కాంగ్రెస్ నాయకులు దివంగత డాక్టర్.జలాలుద్దీన్ ఖురేషి మనవడు.బీటెక్ మూడవ సంవత్సరంలో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ మెషీన్ లెర్నింగ్ కోవిదుడు గైలి దాస్   వద్ద మూడు నెలల ఇంటర్న్షిప్ చేశాడు.తరువాత బెంగళూర్ లోని “మైక్రోసాఫ్ట్ రీసర్చ్” లో రెండు సంవత్సరాలు పనిచేసి, యు ఎస్లో లో ని యు మాస్  (యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్) నుండి 2023 లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్ లో యం ఎస్  పట్టా పొందాడు. యం ఎస్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రముఖ ఐటీ సంస్థ అయిన గూగుల్ లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం దక్కింది.స్థానిక మూలాలు కలిగిన ఈ యువకుడి విజయం వెనకబడ్డ కొడంగల్ ప్రాంత యువతకు స్ఫూర్తి నివ్వాలని ఆకాంక్షిస్తున్నాం_.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment