---Advertisement---

ఎన్.ఎం.కె ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపాల

---Advertisement---

మూ

మోతే డిసెంబర్ 09 (తెలంగాణ కెరటం) సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుపకుండా నిర్మాణ పనులు చేస్తున్న ఎన్ఎంకె విత్తనాలు ఫ్యాక్టరీని నిర్మాణ పనులు ఆపాకుంటే ఫాక్టరీని రైతులతో కలిసి ముట్టడిస్తామని పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ హెచ్చరించారు.సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఎన్ఎంకె ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11నుండి జరిగే ప్రచార యాత్ర,సంతకాల సేకరణ గోడ పత్రికలను ఈ రోజు ఆత్మకూరు మండలం శేట్టిగూడెం గ్రామంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ* ఈ కంపెనీ నిర్మాణం పూర్తి అయితే భూమి, నీరు,వాయు కాలుష్యము అవుతాయని అన్నారు. దీని చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.అదే విధంగా పంట భూములు కూడా సారం తగ్గిపోయి బీడు భూములుగా ఏర్పడుతాయని అన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతయాన్నారు.అందుకే ప్రజలకు,రైతులకు నష్టం కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ చేస్తున్న ప్రచార యాత్ర, సంతకాల సేకరణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకి నారాయణ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, పానుగంటి మల్లారెడ్డి, శంకర్, శ్రీనివాస్ రెడ్డి,వీరయ్య, ఉపేందర్ రెడ్డి,కాకి పాపిరెడ్డి,గజ్జి శంకర్, లింగారెడ్డి, సాయి,ఉత్తరమ్మ,సామ్రాజ్యం, లక్ష్మి, ముత్తయ్య,గంగయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment