ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసింది.
మెదక్ నియోజకవర్గం లంబాడి ఐక్యవేదిక కోఆర్డినేటర్ లంబాడి సురేష్ నాయక్ అన్నారు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 10:
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ నియోజకవర్గం లంబాడి ఐక్యవేదిక కోఆర్డినేటర్ సురేష్ నాయక్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయని మెదక్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సురేష్ నాయక్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు ప్రజల గురించి ఎంతో అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఎవరికైనా ఆపద కలుగుతే వెంటనే వెళ్లి వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సాయంతో పాటు అండగా ఉంటానని ఆయన భరోసా ఇస్తున్నారు. గత ప్రభుత్వం పథకాలకు మాత్రమే పరిమితమైంది. చెరువు కట్టలు, మిషన్ భగీరథ బిల్లులు, రాలేదని ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని బి.ఆర్.ఎస్ పార్టీని ప్రశ్నించారు. వర్షాకాలంలో హిందూ కూలిపోయిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పి నేటి వరకు అమలు చేయలేదని ఆయన అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందన్నారు. త్వరలో మెదక్ నియోజకవర్గం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట సురేష్, ఘన్పూర్ మహేష్, నక్కల్ నవీన్, బాలు నాయక్, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.