---Advertisement---

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి.

---Advertisement---

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి.

 

రాజకీయ పార్టీలను కోరిన కలెక్టర్.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 10):

 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీ లోపు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రాజకీయ పార్టీలను కోరారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాలసముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరములో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 464, గ్రామ పంచాయతీలు, 4140, వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 4140, పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.ఈ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలుపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడంజరుగుతుందని, జిల్లా కలెక్టర్ ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్ రావు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment