---Advertisement---

డిక్కీ’ జిల్లా సమన్వయ కర్త నల్ల శ్యామ్ కి ఘన సన్మానం

---Advertisement---

‘డిక్కీ’ జిల్లా సమన్వయ కర్త నల్ల శ్యామ్ కి ఘన సన్మానం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 10 : దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంస్థ జగిత్యాల జిల్లా సమన్వయకర్తగా రాపల్లి గ్రామానికి చెందిన నల్ల శ్యామును నియమిస్తున్నట్టు నియామక పత్రాన్ని అందించిన సందర్భంగా దిక్కి జిల్లా సమన్వయకర్త నల్ల శ్యామును సోమవారం జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల నాయకులు ఘన స్వాగతం తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అఖిలభారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నకుమల్ల లక్ష్మీనారాయణ, సామాజికవేత్త అక్క విజయ్ కుమార్ లు మాట్లాడుతూ దళితులు ఇండస్ట్రీలు వ్యవస్థను వ్యాపారంగంలో అభివృద్ధి పథంలో ముందు కొనసాగడానికి డిక్కీ సంస్థ ఎంత దోహదపడుతుందని, ఈ సంస్థ 2010 సంవత్సరంలో స్థాపించబడి ఎందరో దళితులను వ్యాపారవత్తులుగా మార్చిన సందర్భాలు మెదక్ ఉన్నాయని అన్నారు. ఇంతటి మహోన్నతమైన డిక్కీ సంస్థ జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్గా నల్ల శ్యామును నియమించడం ఎంతో అభినందనీయమని కొనియారు. దళిత సామాజిక వర్గంలోనూ ఎంతో మంది చదువుకొని నిరుద్యోగ ఉన్నవారికి వివిధ రంగాల్లో వ్యాపారాలు నెలకొల్పి ముందుకెళ్లుటకు డిక్కీ సంస్థ ప్రభుత్వపరమైన ఇప్పించుటకు మధ్యవర్తిత్వం వ్యవహరించి ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. అనంతరం నల్ల శ్యామ్ మాట్లాడుతూ మనిషి ఎదుగుదలలో ముఖ్య భాగమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఒకటైన ఆర్థిక రంగంలో డిక్కీ సంస్థ గత 20 సంవత్సరాలుగా పద్మశ్రీ మిలింద్ కాంబ్లి 2005 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే వేదికగా స్థాపించడం జరిగిందని, ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత, అనగా 2010లో పద్మశ్రీ రవి కుమార్ నర అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ సంస్థను స్థాపించారని తెలిపారు. ఇలాంటి మహోన్నత సంస్థలో నేను సేవ చేయడానికి అవకాశం పొందడం నాకు ఎంతో సంతోషకరమని నన్ను నమ్మి ఇంత గొప్ప బాధ్యతను నా మీద ఉంచిన పద్మశ్రీ రవి కుమార్ నరకి, జాతీయ అధ్యక్షులు డిక్కీ, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ దాసరి మేడమ్ కు, రాష్ట్ర కోఆర్డినేటర్ నారాయణ దాసరి, రాష్ట్ర ముఖ్య కార్యవర్గానికి ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు. మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా లోని దళితుల ఆర్థిక అభివృద్ధి కొరకు నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని అని అన్నారు. జిల్లా కేంద్రంలో నన్ను ఘనంగా సన్మానించిన వివిధ సంఘాల, సామాజిక బాధ్యులందరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ స్వామి, సైదుల విజయ్, శైలేందర్, అనిల్, లక్ష్మయ్య, గజ్జల స్వామి, బచ్చల స్వామి, జర్నలిస్టు రవీందర్ రావు, జి.శ్రీనివాస్, కాంతారావు, కందుకూరి నారాయణ, మల్లేశం, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment