తెలంగాణ తల్లీ విగ్రహం బాగుంది.
రాద్ధాంతం చేయడం బి.ఆర్. ఎస్ కు తగదు.
అచ్చంపేట అభివృద్ది ప్రదాత ఎమ్మెల్యే వంశీకృష్ణ .
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 9):
డిసెంబర్ 9న తెలంగాణా రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధి జన్మదినము సందర్భంగా బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం చాలా మంచిగా ఉందని, ఉద్దేశపూర్వకంగానే బి ఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని సరైంది కాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం శ్రీమతి సోనియాగాంధీ అని జన్మదిన ముసందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా శుభ పరిణామం ఓర్వలేక టిఆర్ఎస్ నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటుంటే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సకల జనులు సంతోషంగా ఉండే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ముఖ్యమంత్రి ని అభినందించాల్సిందని అన్నారు విమర్శించడం తగదు అని అన్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు.అచ్చంపేట అభివృద్ది ప్రదాత ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏడాది లోనే అచ్చంపేట కు 500 పైగా కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేశారు అని అన్నారు.