---Advertisement---

న్యాయ పోరాటంలో గెలిచిన ఆది శ్రీనివాస్ కు అభినందనలు తెలిపిన జువ్వాడి కృష్ణారావు 

---Advertisement---

న్యాయ పోరాటంలో గెలిచిన ఆది శ్రీనివాస్ కు అభినందనలు తెలిపిన జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 10 : వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ చేసిన సుధీర్ఘ న్యాయపోరాటంలో వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు భారత దేశ పౌరుడు కాదని ఉన్నత న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జువ్వాడి కృష్ణారావు మాట్లడుతూ వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారత దేశ పౌరసత్వం లేనప్పటికీని ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వం నుండి జీతభత్యాలు పొందాడని, దీనిపై ప్రస్తుత వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 15 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించినందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు. చెన్నమనేని రమేష్ బాబు తెలంగాణ ప్రభుత్వం నుండి పొందిన జీతభత్యాలతో పాటు అలవెన్సుల రూపంలో పొందిన డబ్బులు తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని జువ్వాడి కృష్ణారావు అన్నారు. భారతదేశ పౌరసత్వం కూడా లేనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించినటువంటి టిఆర్ఎస్ పార్టీపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment