11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ కార్యక్రమం.
ముఖ్య ప్రణాళిక అధికారి బద్రీనాథ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 10:
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడిఓసి హాల్లో మండల వ్యవసాయ అధికారులకు, విస్తరణాధికారులకు , మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కి 11వ ప్రపంచ వ్యవసాయ గణనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ముఖ్య ప్రణాళిక అధికారి మాకం బద్రీనాథ్ మాట్లాడుతూ ఈ గణనను రెండు దశలలో జరుగునని. రెండవ దశలో 98 గ్రామాలలో 64 మంది విస్తరణ అధికారులు పాల్గొంటారని మరియు మూడవ దశలో 38 గ్రామాలలో ఏడు శాతం ఆధారంగా తీసుకున్న గ్రామాలలో ఇన్ పుట్ సర్వేని మూడవ దశలో 22-23 సంవత్సరం ను ఆదారం చేసుకొని మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ చేస్తారని తెలిపారు ఈ రెండవ దశలో 21- 22 ఆధార సంవత్సరం తీసుకొని ఆ సర్వే నంబర్లలో ఏ ఏ పంటలు వేశారు వాటి దిగుబడి వివరాలను సేకరిస్తామన్నారు. ఈ వివరాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తారని. ఈ సర్వేని గడువు లోపల పూర్తి చేయాలని సిపిఓ కోరారు. వినయ్ కుమార్ ఏడి టెక్నికల్ ప్రసంగిస్తూ ఈ సర్వే ని జాగ్రత్తగా నమోదు చేయాలని తదుపరి మాస్టర్ ట్రైనర్ రవి డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ శిబిరాన్ని కొనసాగిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఏ విధంగా నమోదు చేయాలి అనేది వివరించారు వారికి మొబైల్లో నమోదు చేయడానికి కావలసిన లాగిన్సు క్రియేట్ చేసి ఇస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వందన ఏవో టెక్నికల్ జి సురేష్ ఎంపిఎస్ఓ పాల్గొన్నారు.