ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. 

ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి.

 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 10:

 

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు తెలిపారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో మంగళవారం అదనపు కలెక్టర్ నగేష్,డిపిఓ యాదయ్య తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు.ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రదర్శించడం జరిగిందన్నారు.జిల్లాలో మొత్తం 491 గ్రామ పంచాయతీలు 4,210 వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 4,210 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలుపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉదయం 11 గంటలకు ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా ఉంటుందన్నారు.ఈ సమావేశం లో డీపీవో యాదయ్యటిఆర్ఎస్ పార్టీ నుండి పద్మాదేవేందర్ రెడ్డి,వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment