బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేటలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 11)
తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు మంగళవారం అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ తల్లికి బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు తెలంగాణలో ఎంతోమంది మేధావుల విగ్రహాలు పెట్టకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట సింగిల్ విండో చైర్మన్ మంద రాజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అమీనోద్దీన్, పదర మాజీ జడ్పిటిసి రాంబాబు నాయక్, కౌన్సిలర్లు రమేష్ రావు, అంతటి శివ, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ మాదిగ, కుంభం ప్రవీణ్ గౌడ్, ఖాజా, బొల్లె నాగరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.