---Advertisement---

సైన్స్‌ తోనే మానవుని మనుగడ,

---Advertisement---

సైన్స్‌ తోనే మానవుని మనుగడ,

 

విద్యార్థుల మేద శక్తికి ప్రదర్శన సైన్స్ ప్రదర్శనలు దోహదపడతాయి,

 

నాగర్ కర్నూలు జిల్లా శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి.

 

విద్యార్థుల ప్రదర్శనను తిలకించి అభినందించిన కలెక్టర్,

 

స్థానిక ఎమ్మెల్యే

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్,

 

స్థానిక ఎమ్మెల్యే,

నాగర్ కర్నూలు జిల్లాను దేశస్థాయిలో ఇనుమడింపజేయాలి,

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 11):

 

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,

నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులు దేశ ప్రతిష్టను పెంచేలా శాస్త్రవేత్తలుగా రూపొందాలి,నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి,సైన్స్‌ తోనే మానవుడి మనుగడ ముడిపడి ఉందని, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలను రూపొందించి నాగర్ కర్నూలు జిల్లా ప్రతిష్టను దేశ స్థాయిలో ఇనుమడింపజేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి లు విద్యార్థులకు సూచించారు.జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు 2024 కార్యక్రమాన్నిపురస్కరించుకుని బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సభాధ్యక్షులుగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డిలు పాల్గొన్నారు.

మొదటగా విశ్వశాంతి హైస్కూల్ చారగొండ విద్యార్థులు సుస్వాగత గీతాన్ని ప్రదర్శించగా. కల్వకుర్తి కేజీబీవి, లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈవో, ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ యావత్తు మానవ మనుగడ సైన్స్ తో ముడిపడి ఉందని, మానవునికి ఎదుగుదలకు సైన్సు అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. పూర్వపు రోజుల్లో రవాణా సౌకర్యానికి ఎంతో కష్ట నష్టాలు ఉండేవని, ప్రస్తుత కాలంలో ప్రపంచ దేశాలను చుట్టి వచ్చేలా అత్యాధునిక పద్ధతుల్లో రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాయని అందుకు ప్రధాన కారణం సైన్స్ అని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి సైన్స్‌ లో ప్రయోగాలు, నూతన ఆవిష్కరణ లు రూపొందించే దిశగా ఎదగాలని సూచించారు. విద్యార్థి జీవితంలో సమయము ను సద్వినియోగం చేసుకున్న వాళ్లే విజేతలుగా “గా నిలుస్తారన్నారు. “విద్యతోపాటు, లోతైన పరిశోధనలపై దృష్టి సారించాలనిసూచించారు.విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలుఆలోచింపజేసేవిగా ఉన్నాయని కొనియాడారు. విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.

విద్యార్థులు జిల్లా ప్రతిష్టను దేశస్థాయిలో రాణించేలా, జిల్లా నుండి భావిశాస్త్రవేత్తలు గా ఎదగాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేసిన జిల్లా విద్యాశాఖాధికారి, విద్యాశాఖ సిబ్బందికి సైన్స్ ఉపాధ్యాయులకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అన్ని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలను తిలకించేలా అధికారులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మెదడు సైన్స్ తోనే అనుసంధానం అయి ఉంటుందని తెలిపారు. తను కూడా సైన్స్ విద్యార్థి నని ఒక డాక్టర్ గా సైన్స్ విలువ సమాజంలో ప్రాముఖ్యత తనకు తెలుసు నని ఈ సందర్భంగా చెప్పారు. జిల్లా ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో రాణించే దిశగా శాస్త్రవేత్తలు తయారు కావాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు. విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాల్లో

రాణించాలన్నారు. నేటి బాలలే భావిభారత శాస్త్రవేత్తలని,అదిశగా విద్యార్థుల ఆలోచనలు ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, తెలిపారు.

నాగర్ కర్నూల్ డిఇఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ మానవ మనుగడకు ముడిపడి ఉన్న సైన్సును విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శనలు ఇంతగానోతోడ్పడతాయన్నారు. విద్యార్థులు ఎంతోమంది శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ ఆకాంక్షించారు.అనంతరం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రదర్శన గదులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి డిఇఓ రమేష్ కుమార్ ప్రారంభించి విద్యార్థుల రూపొందించిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి ప్రదర్శనల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చారగొండ విశ్వశాంతి హై స్కూల్ విద్యార్థులు, కల్వకుర్తి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులు, లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల నృత్యాలను తిలకించి విద్యార్థులను ప్రత్యేకంగా కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈవో అభినందించారు.

జిల్లావ్యాప్తంగా 400 పాఠశాలల నుండి 512 ప్రదర్శనలను విద్యార్థుల రూపొందించారు. మూడు రోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి ప్రదర్శనలను జిల్లాలోని విద్యార్థులందరూ తిలకించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉపాధ్యాయుడు గుడిపల్లి నిరంజన్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు, నోడల్ అధికారి కురుమయ్య, ఏసీ రాజశేఖర్ రావు, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు 1500 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment