---Advertisement---

13,15 వార్డులలో బిజెపి నూతన బూత్ కమిటీల నియామకం

---Advertisement---

13,15 వార్డులలో బిజెపి నూతన బూత్ కమిటీల నియామకం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 10 : కోరుట్ల పట్టణంలోని భీమనుదుబ్బ శక్తి కేంద్రం ఇంచార్జ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదవేని మహేష్ ఆధ్వర్యంలో 13,15,01,వ వార్డులలోని 143,144,145,146 బూత్ లలో బుధవారం నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా బూత్ లకు సుదవేని కీర్తన, గడ్డం రాజశేఖర్, నారవేణి అశోక్, అందుర్తి రమేష్ లను అధ్యక్షులుగా నియమించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రాచకొండ యాదగిరి బాబు హజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాల భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాలని కోరారు. బిజెపి పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని, అందుకే ఢిల్లీలోనే కాదు గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, బూత్ స్థాయిలో కమిటీ పటిష్టంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ బిజెపి అధ్యక్షులు బింగి వెంకటేష్, బిజెపి సీనియర్ నాయకులు పోతుగంటి శ్రీనివాస్, ఇల్లెందుల కీర్తి కుమార్, పోతుగంటి లవ కుమార్, చింతకింది రాజేశం, దువ్వాక శంకర్, నారవేణి విజయ్, గడ్డం శ్రీనివాస్, పోతుగంటి రవి, మద్దుల హరీష్, గంగాధర్, కళ్యాణ్, కంటాల శివ, గట్ల నిఖిల్ సాయి, పోతుగంటి శ్రావణ్ కుమార్, భరత్, నవదీప్, మనివర్షిత్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment