కస్తూర్బా గాంధీ పాఠశాలలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడ్డ విద్యార్థి చికిత్స కోసం ఆర్థిక సాయం. 

కస్తూర్బా గాంధీ పాఠశాలలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడ్డ విద్యార్థి చికిత్స కోసం ఆర్థిక సాయం.

-ప్రముఖ లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్. మోహన్ నాయక్ 5,000 రూపాయలు అందజేత.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 11:

మెదక్ జిల్లా రామాయపేట మండలం కోమటిపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ విద్యాలయానికి చెందిన విద్యార్థిని రెండవ అంతస్తు నుండి హాస్టల్ నుంచి పడిన విద్యార్థిని గురించి ప్రిన్సిపాల్ అనురాధను అడిగి తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆ విద్యార్థికి చికిత్స నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రిన్సిపాల్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ,పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మెదక్ నియోజకవర్గ లంబాడి హక్కుల ఐక్యవేదిక కోఆర్డినేటర్ సురేష్ నాయక్, ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు సురేష్ నాయక్ తెలిపారు.డాక్టర్ మోహన్ నాయక్ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయక్ ,సామ్య నాయక్,ముదిరాజ్ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి పచ్చంటి పరశురాములు.సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment