---Advertisement---

డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి 

---Advertisement---

డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 10 : నేటీ నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించిన ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ లకు సంంధించిన పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య సూచించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ లో బుధవారం రోజున స్థానిక ప్రైవేటు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లతో అత్యవసరంగా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య మాట్లాడుతూ, బీ.ఏ, బీ.కాం, బీ.ఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించిన ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ల పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ పరీక్షలను సక్రమంగా, ప్రశాంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. హాల్ టికెట్లు ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతి ఇస్తామని, ఈ సెమిస్టర్ ల పరీక్షలు విజయవంతం అయ్యేటట్లు చూడాలని ఆయన సూచించారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, ఈ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని “సమావేశం” ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలతో సమావేశం నిర్వహించడం విశేషం. ఈ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే.వేంకయ్య ప్రకటించారు. ఈ సమావేశంలో “జ్ఞానోదయ” డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సంతోష్, డి.రాజు, “సాహితి” డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంగారాం, “అరోరా” డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరేష్, “వాగ్దేవి” డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవితో పాటు స్థానిక కళాశాల సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న, కళాశాల ఎగ్జామినేషన్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెచ్.ఓ.డి మనోజ్ కుమార్, బోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment