కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అభివృద్ది చేసింది శూన్యం.
హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్న ప్రభుత్వం.
బి ఆర్ ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 11):
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అభివృద్ది చేసింది శూన్యమని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే & బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గువ్వల బాలరాజు విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కూల్చివేతలు అసభ్య పదజాలంతో మాటలు, ప్రశ్నించిన వారిపై దాడులు చేసిందన్నారు. నిమ్మకు నీరు ఎత్తినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో మా ప్రభుత్వ హాయంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు ఎప్పటి వరకు అందిస్తారని ప్రశ్నించారు. లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క కాలువలు ముందు చెప్పిన మార్గం కాకుండా ప్రధానంగా టిఆర్ఎస్ కి చెందిన రైతుల కులాల మధ్యనే పోయే విధంగా రూట్ మ్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.అచ్చంపేట నియోజకవర్గం లోని గతంలో మన్ననూర్ ప్రధాన రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారాలను తొలగించి, నేడు దోమల పెంటలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి సముదాయాలను పోలీసులను పెట్టి కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.అసలు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏముందనీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాపన చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని మండిపడ్డారు.ఆరోగ్యానికి 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మను పటేల్, రమేష్ రావు, అంతటి శివ, పార్టీ నాయకులు అమీనోద్దీన్, జడ్పీటీసీ రాంబాబు నాయక్, నాయకులు శంకర్ మాదిగ, దేవ, రేణయ్య, కరుణాకర్, సోషల్ మీడియా ఇంచార్జి పిల్లి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.