సినీ నటుడు మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలి
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి డిసెంబర్ 11:
సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని కల్వకుర్తి జర్నలిస్ట్ యూనియన్ మీడియా తీవ్రంగా ఖండించారు. సినీ నటుడు మోహన్ బాబు పై డిఎస్పి కి వినతి పత్రం. మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రవీందర్, శ్రీధర్, రామ్ చందర్, బోడ పాండయ్య, రాజు, కృష్ణయ్య, శ్రీను, చక్రపాణి, నందు తదితరులు పాల్గొన్నారు.