---Advertisement---

శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు

---Advertisement---

శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 10 : కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో బుధవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు పండితులు, ప్రముఖ విద్యావేత్త, కవి బట్టు హరికృష్ణ, విశ్రాంత కమిషనర్ కుమారస్వామిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన బట్టు హరికృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గీత జయంతి విశిష్టత, ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భగవద్గీత పుట్టిన రోజు పురస్కరించుకొని శ్రీ కృష్ణుడు అర్జునునికి హితోపదేశం ఏ విధంగా చేశాడు, కర్మానుసారం బందుపరివార బంధాలను కర్మలో భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ధర్మానికి అధర్మానికి ఉన్న తేడాను వివరించారు. విద్యార్థులకు భగవద్గీత పైన మక్కువ ఏర్పడేలా కచ్చితంగా శ్లోకాలు నేర్చుకోవడం చేయవలసి ఉంటుందని, శ్లోకాలు నేర్చుకోవడం వలన భవిష్యత్తులో అన్ని భాషల పైన పట్టును సంపాదించి అనర్గళంగా మాట్లాడే శక్తిని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్, ప్రబంధకారిని కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, పాఠశాల కోశాధికారి కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment