---Advertisement---

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు.

---Advertisement---

గ్రూప్ టు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్

హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ, గృహ,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, బుధవారం ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ,హాస్టల్స్/ రెసిడెన్షియల్ స్కూల్స్ సందర్శన, లపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవ సహాయం, సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలు, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ , తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు.రాష్ట్ర రెవెన్యూ, గృహ,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో మనం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ డిసెంబర్ 9 వరకు ఘనంగా నిర్వహించిన వేడుకలకు మరియు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా పూర్తి చేసిన నందులకు జిల్లా కలెక్టర్లను,అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డిసెంబర్ 5న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రజాపాలన ద్వారా మనకు సుమారు 80 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా 80 లక్షల దరఖాస్తులకు సంబంధించి సంపూర్ణ వివరాలు డిసెంబర్ నెలాఖరు లోపు సేకరించాలని, ప్రతి 500 ఇండ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి తెలిపినారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మాట్లాడుతూ ప్రతి 500 ఇండ్ల దరఖాస్తులు సర్వే కొసం ఒక సర్వేయర్ చొప్పున సర్వే చేసేందుకు అవసరమైన సిబ్బంది గుర్తించి వారికి శిక్షణ కార్యక్రమం 2 రొజులలో పూర్తి చేయాలని అన్నారు.సర్వే కోసం నగరంలోని వార్డు అధికారులు, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, రూరల్ ప్రాంతాల్లో గ్రామస్థాయి సిబ్బంది సర్వేయర్ లుగా నియమించాలని జిల్లా కలెక్టర్లకి సూచించారు.
జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు అవగాహన కలిగించడానికి సమావేశాలు నిర్వహించడం జరిగిందని , జూమ్ మీటింగ్ ద్వారా యాప్ కు సంబంధించిన వివరాలను అధికారులకు వివరించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 33, వేల 124, ఇండ్లకు దరఖాస్తులు వచ్చాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ను నియమించి రాబోయే 20 రోజులలో పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేస్తామని అన్నారు.మండల స్థాయిలో గ్రామస్థాయిలో , మున్సిపాలిటీ స్థాయిలోనీ అధికారులు ప్రజా పాలన ద్వారా వచ్చిన అప్లికేషన్లలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారి దగ్గరికి వెళ్లి ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో వివరాలు నమోదు చేయుటకై సర్వే ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు మున్సిపాలిటీ స్థాయిలో వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడంజరుగుతుందని, ఎంపీడీవోలు, ఎంపీఓ లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు.జిల్లాలో 9731 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు హాజరవుతున్నారని తెలియజేశారు .జిల్లా వ్యాప్తంగా 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన అన్ని వసతులుకల్పించామని, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లకు పూర్తి సహకారం అందించేందుకు వ్యవస్థలను చేశామని అన్నారు. గ్రూప్ 2 పరీక్షలకు అభ్యర్థుల సకాలంలో చేరుకునేలా ముందస్తుగా విస్తృత ప్రచారం చేశామని తెలిపారు. ప్రశ్న పత్రాలు ఓఎంఆర్ సీట్ల తరలింపు కోసం పోలీస్ అధికారులతో బందోబస్తు, ఎస్కార్ట్ సౌకర్యం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లాలోని గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు నోడల్ అధికారులు, అదనపు కలెక్టర్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. గురుకుల పాఠశాలలో అందిస్తున్న భోజనం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిసరాల పరిశుభ్రత, విద్యార్థు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్య అందించేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు, గురుకులాలలో అధికారులు భోజనం చేస్తూ,రాత్రి బస కూడా చేస్తున్నట్లు, తాను కూడా గురుకులాలలో రాత్రిపూట నిద్రించినట్లు , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కి వివరించారు.ఈ సమావేశంలో డిప్యూటీ జెడ్పి సీఈఓ గోపాల్, డీఈవో రమేష్ కుమార్, డిపిఓ రామ్మోహన్రావు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment