---Advertisement---

పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించిన న్యాయవాది రమేష్

---Advertisement---

పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించిన న్యాయవాది రమేష్

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 12 : పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది తోకల రమేష్ ఆర్థిక సాయం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కోరుట్ల పట్టణానికి చెందిన పందిరి కృష్ణ కుమార్తె మేఘన వివాహానికి గురువారం ఆర్థిక సాయం అందించారు. వివాహ ఏర్పాట్లలో ఏమాత్రం లోటు లేకుండా ఘనంగా ఆడపడుచు పెళ్లి జరిపించేందుకు తన వంతు సాయాన్ని అందించారు. 2022లో కూడా పందిరి కృష్ణ ప్రథమ కుమార్తె భవాని వివాహానికి కూడా నూతన వస్త్రాలు, మంగళ సూత్రం, మట్టెలు, వంట సామాగ్రి అందించారు. కోరుట్ల మండలం అయిలాపూర్, చిన్నమెట్ పల్లి గ్రామాలకు చెందిన వివాహాలకు ఆర్థిక సాయం అందించారు. ఇలాగే మెట్ పల్లి అరెపేట్ గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి, అబ్బాయి వివాహానికి మంగళ సూత్రాలు, మట్టెలు, నూతన వస్త్రాలు, పేదింటి ఆడపడుచు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్రముఖ న్యాయవాది తోకల రమేష్ తమకు తోచినంత సాయం చేసి పెళ్లి సామాగ్రితో పాటు పుస్తె, మట్టెలు, నూతన వస్త్రాలు అందించారు. పేదింటి అమ్మాయి పెళ్లికి అండగా నిలిచి గురువారం పుస్తే, మట్టెలు, నూతన వస్త్రాలు, దాదాపుగా 25వేల విలువైన సామాగ్రి పందిరి మేఘన తండ్రి కృష్ణకు అందించారు. పేదింటి యువతుల పెళ్ళిళ్ళ కోసం ఆర్థికంగా అండగా నిలుస్తున్న ప్రముఖ న్యాయవాది తోకల రమేష్ ను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్, ప్రముఖ వ్యాపారవేత్తలు పోతని ఆదిమల్లయ్య, సిరిపురం గణేష్, కుంట తిరుమల్, కల్లూర్, ఝాన్సీ రోడ్ గంగపుత్ర సంఘాల అధ్యక్షులు పెద్దబోయిని పండరి, దేశవేణి మోహన్, పల్లికొండ అంజయ్య, పల్లికొండ రవి, పందిరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment