ఆటల పోటీలో మైనారిటీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 12):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ఆటల పోటీల్లో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మైనారిటీ బాలుర పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ యాదగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో ఆటల్లో సోహైల్, ఎస్ కే చోటు, సాదిక్ తో పాటు అథ్లెటిక్స్ పోటీలో యువరాజు, సాదిక్ పాషా, రాహుల్ చౌహన్ పాల్గొని ప్రతిభ చాటినట్లు పేర్కొన్నారు. వీరు జిల్లా స్థాయిలో జరిగె పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.