ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతమిస్తుంది.
నల్లమల్లను స్పోర్ట్స్ హబ్ గా మారుస్తా.
అచ్చంపేట పట్టణంలో సీఎం కప్ టోర్నమెంట్స్ మండల స్థాయి క్రీడలను ఎం ఎస్ ఎన్ గ్రామర్ స్కూల్ లో క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 12):
రాష్ట్ర ప్రభుత్వం నల్లమల ప్రాంతాన్ని క్రీడల హబుగా మార్చడానికి గౌరవం ముఖ్యమంత్రి సహకారంతో క్రీడల హబ్ గా మారడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం అన్నారు, గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంను రాజీవ్ ఎన్టీఆర్ మినిస్ట్రీయంగా మార్చడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీఎం కప్ టోర్నమెంట్ గ్రామ మండల జిల్లా స్థాయిలలో వారి వారి ప్రతిభ కనబరుస్తూ క్రీడలను ప్రోత్సహిస్తుందని త్వరలో నల్లమలలో కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు క్రీడా మైదానాలు ఆట వస్తువులు ఓదెలాగున సమకూర్చడానికి తమ వంతుగా ప్రయత్నం క్రీడాకారులకు ఎప్పటికీ ఉంటుందని అన్ని రకాల సకల సౌకర్యాలు గల స్టేడియంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ వంతు కృషితో తీర్చిదిద్దుతాం అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఎంపీడీవో అధికారులు మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి మల్లేష్,. ఇతర నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.