---Advertisement---

ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫీ’జులుం’…!

---Advertisement---

ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫీ’జులుం’…!

 

‘రీయింబర్స్మెంట్’ పేరుతో అడ్మిషన్లు

 

‘రిఫండబుల్’ పేరుతో వేధింపులు

 

అదనంగా నెలకు మరో 500 వసూలు

 

ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు

 

ఆందోళనలో విద్యార్ధులు, తల్లిదండ్రులు

 

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 12 : రిఫండబుల్ ఫీజులు చెల్లిస్తేనే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో గత విద్యా సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కన్సాలిడేటెడ్, ప్రొవిజన్, టీసీ, తదితర సర్టిఫికెట్లు, కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడానికి కాలేజీ నిర్వాహకులు ససేమిరా అంటున్నారు. రిఫండబుల్ ఫీజు పేరుతో ఆయా సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్ధులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 22,500/- రూపాయలు రిఫండబుల్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు పొందాలని, లేదంటే నెలకు 500/- రూపాయల చొప్పున అదనంగా నిర్వహణ రుసుము వసూలు చేస్తామని హుకుం జారీ చేస్తున్నారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నా కాలేజి యాజమాన్యం కనికరించకుండా విద్యార్ధులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో కొందరు అక్కడా ఇక్కడా అప్పులు తీసుకుని ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు పొందుతున్నారు. మరి కొందరు డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఫీజు చెల్లించే స్థోమత లేక ఉద్యోగాలు, ఉన్నత చదువుల నిమిత్తం సర్టిఫికెట్లు లేక వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. వాస్తవానికి పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులు ఆర్ధిక భారంతో ఉన్నత చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉన్న కళాశాలల్లో ‘రీయింబర్స్మెంట్’ పథకం ద్వారా అడ్మిషన్లు పొంది డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా కళాశాలలు కూడా అడ్మిషన్ల సమయంలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించనవసరం లేదని విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. రీయింబర్స్మెంట్ పేరుతో మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుని ఇప్పుడు 22,500/- రూపాయలు ఫీజు చెల్లించమంటే ఎక్కడి నుండి తెచ్చేదని విద్యార్టుల తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ అధికారులు చొరవ చూపి సంబంధిత కాలేజీపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి ‘దోస్త్’ ద్వారా జనరల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారు ఫీజు రీయింబర్స్మెంట్ కింద సీటు సాధిస్తే నిబంధనలకు లోబడి ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని కోర్సు పూర్తి చేసే వరకు ఉచితంగా చదువుకోవచ్చు. సదరు కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా’రీయింబర్స్మెంట్’ రాలేదని చెబుతున్న యాజమాన్యంకు 2021-2022 సంవత్సర ‘రీయింబర్స్మెంట్’ సొమ్ము కాలేజి అకౌంట్ లో జమ ఆయినా కూడా విద్యార్ధుల వద్ద నుండి మూడు సంవత్సరాలకు గానూ 22,500/- రూపాయలు ముక్కు పిండి వసూలు చేయడం గమనార్హం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment