---Advertisement---
---Advertisement---

ఈ నెల 17న హైదరాబాదులో నిర్వహించే దీక్షను విజయవంతం చేయండి.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 12):

 

ప్రభుత్వం, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఆర్సీ, డి ఎ ల బకాయిలు, ఈ కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపస్ ఆధ్వర్యంలో ఈ నెల 17 న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్మాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ధర్మాగ్రహ దీక్షకు సంబంధించిన గోడపత్రికను గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆవిష్కరించారు. ఈ దీక్షను నాలుగు దశలలో మొదటగా పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో, మండల స్థాయిలో తహసీల్దారులకు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల ముందు ధర్నా మరియు చివరగా హైదరాబాదులో ఈ దీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగర శ్రీనివాసులు పెంట్యా నాయక్ , జిల్లా నాయకులు అరవింద్ రావు, జగదీశ్వర్, రాంగోపాల్ గౌడ్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్, సతీష్ కుమార్, రాజేష్, గోవర్ధన్, చంద్రశేఖర్, భరత్, తిరుపతయ్య మరియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment